తిరుమల (Tirumala) తిరుపతి ఘాట్ రోడ్డు పై ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. గత పది రోజుల్లోనే మూడు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో ప్రమాదం జరిగింది.. ఇలా వెంట వెంటనే ఇలాంటి ప్రమాదాలు జరగడం తో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తిరుమల ఘాట్ రోడ్ (Ghat Road)లో మరో ప్రమాదం జరిగింది. తిరుపతి (Tirupati) నుంచి తిరుమలకు వెళ్తున్న సమయంలో 2వ ఘాట్ రోడ్డులో యాక్సిడెంట్ (Accident)చోటు చేసుకుంది. అదుపుతప్పిన టెంపో ట్రావెలర్(Tempo Traveller).. కొండను ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుండి తిరుమలకు వెళ్తుండగా, టెంపో ట్రావెలర్ వాహనం కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి.సైడ్ సేఫ్టీ వాల్ (Safety wall)లేకపోవడంతో వాహనం నేరుగా కొండను ఢీకొట్టి ఆగిపోయింది..అయితే ఈ ప్రమాద సమయంలో టెంపో లో ఏ ఒక్కరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది..కొన్నిరోజుల క్రితం తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో 28వ మలుపు వద్ద ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు (Electric bus) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.
ప్రమాదానికి అతివేగమే కారణం అని పోలీసులు తెలిపారు. కలియుగ దైవం కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) దర్శనానికి నిత్యం వేలాది మంది దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. తిరుమల ఘాట్లో ప్రమాదాలకు స్పీడ్ లిమిట్ నిబంధనలను ఎత్తివేయడం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గతంలో అలిపిరి (Alipiri) నుంచి తిరుమలకు ప్రయాణ సమయం 28 నిమిషాలుగా ఉండేది. తిరుమల నుంచి అలిపిరికి వచ్చే సమయం 40 నిమిషాలు ఉండాలన్న నిబంధనలు అమలు చేశారు. అంతకంటే వేగంగా వాహనాలు రాకపోకలు సాగిస్తే చర్యలు తీసుకునేవారు.