Breaking: టీమిండియా ఆలౌట్..173 పరుగుల వెనకంజలో భారత్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2023లో టీమిండియా తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 173 పరుగుల వెనకంజలో ఉంది.
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 469 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా 296 పరుగులకు ఇన్నింగ్స్‌ను ముగించింది. తొలి ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు తడబడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు శుక్రవారం 151/5 ఓవర్‌నైట్ స్కోరుతో టీమిండియా ఆటను ప్రారంభించింది. ఒక పరుగు వచ్చిందో లేదో ఓవర్‌నైట్ బ్యాటర్ కేఎస్ భరత్ 5 పరుగులకే ఔటయ్యాడు.
రహానే 89, శార్దూల్ 51, జడేజా 48 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. ఆసిస్ బౌలర్లు మూడో రోజు ఆటలో దూకుడుగా వ్యవహరించారు. ఆసిస్ బౌలర్లలో కమిన్స్ 3 వికెట్లను పడగొట్టాడు. బోలాండ్, గ్రీన్, స్టార్క్ తలొక రెండు వికెట్లను తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఇక లియాన్ ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ 296 పరుగుల వద్ద ఆలౌట్ అవ్వడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఇంకా 173 పరుగుల వెనకంజలో ఉంది.
ఇండియా క్రికెటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 15, శుబ్‌మన్ గిల్ 13, ఛతేశ్వర్ పూజారా 14, విరాట్ కోహ్లీ 14 పరుగులు విఫలం అయ్యారు. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోవడంతో అభిమానులు నిరాశ చెందారు. రవీంద్ర జడేజా, అజింకా రహానే కలిసి ఐదో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో టీమిండియా స్కోర్ కాస్త ముందుకు సాగింది. అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ కలిసి ఏడో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత రెండో ఓవర్లోనే అజింకా రహానే ఔటయ్యాడు, 129 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేసిన అజింకా రహానే రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని రహానె అందకుని రికార్డు క్రియేట్ చేశాడు.