CTR: సుమారు రూ. కోటి 20 వేలు విలువచేసే 501 మొబైల్ ఫోన్లను CEIR ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ బుధవారం వెల్లడించారు. ఇప్పటివరకు 14 దశల్లో సుమారు రూ. 9.55 కోట్ల విలువచేసే 4607 ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఫోన్లు రికవరీ చేసిన అధికారులను ఆయన అభినందించారు. CEIR సేవల ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను మరలా పొందవచ్చని చెప్పారు.