ELR: మద్యం సేవించి వాహనాన్ని నడపడంతో భీమడోలుకు చెందిన ఓ యువకునిపై కేసు నమోదు చేసి మంగళవారం ఏలూరు కోర్టుకు హాజరు పరిచామని భీమడోలు CI విల్సన్, ఎస్సై సుధాకర్ తెలిపారు. ఏలూరు ఫస్ట్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ న్యాయమూర్తి నిందితునికి వివిధ సెక్షన్ల కింద 20 రోజులు జైలు శిక్ష విధించినట్టు తెలిపారు.