నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ హిమాన్షు శుక్లా అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోగా పరిష్కారమయ్యేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల్లో చుట్టూ తిరిగే సంస్కృతి లేకుండా చూడాలన్నారు.