KDP: ఎర్రగుంట్ల కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం సినీ హీరో సుమన్ సందడి చేశారు. ఇందులో భాగంగా ఆయన అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. దీన్ని కట్టుదిట్టంగా సంరక్షించడానికి తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.