ELR: దెందులూరు నియోజకవర్గంలో SC, ST కుటుంబాలకు 100% సబ్సిడీతో 2KW సామర్థ్యం గల సోలార్ విద్యుత్ యూనిట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుని ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తొలి సోలార్ విద్యుత్ యూనిట్‌ను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. SC, ST సంక్షేమానికి, అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు.