ATP: గుత్తి పట్టణంలోని చెంబుల భావి వీధిలో డ్రైనేజీ కాలువలో చెత్త చెదారం ఉండడంతో మురుగునీరు ముందుకు కదలగా దుర్వాసనతో పాటు దోమల బెడద ఎక్కువగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలో ఉన్న చెత్తను తొలగించి దోమల నివారణ మందును పిచికారి చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.