కృష్ణా: మచిలీపట్నంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 8 మంది బాధితులకు ఎంపీ వల్లభనేని బాలశౌరి రూ.4.29 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ అమలు కాని వారికి, సీఎం సహాయనిధి ద్వారా ప్రజలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.