NDL: గోకవరంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించి పశుగ్రాసం కాలి బూడిదైంది. స్థానిక రైతు చంద్రారెడ్డి తన కళ్లంలో సుమారు ఆరు ట్రాక్టర్ల మేర పశుగ్రాసాన్ని నిల్వ చేయగా, అది ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో దాదాపు రూ.40 వేల నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పశువుల మేత మొత్తం కాలిపోవడంతో రైతు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.