»A New Twist In The Vizag Harbour Fire Accident 40 Mechanised Fishing Boats Fired
Vizag Harbour: విశాఖ హార్బర్ అగ్ని ప్రమాదంలో కొత్త ట్విస్ట్
విశాఖపట్నంలోని హార్బర్లో నిన్న అర్థరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 40కిపైగా ఫిషింగ్ బోట్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఓ యూట్యూబర్ అని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.
A new twist in the vizag Harbour fire accident 40 boats fired
వైజాగ్ ఫిషింగ్ హార్బర్(vizag fishing Harbour)లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 40కిపైగా ఫిషింగ్ బోట్లు దగ్ధమయ్యాయి. ఒక బోటు నుంచి చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇతర పడవలకు వ్యాపించాయని మత్స్యకారులు, స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో లంగరులో 500 పడవలు ఉండగా వాటిలో 100 బోట్లు మంటల్లో చిక్కుకున్నాయి. పాక్షికంగా దెబ్బతిన్న 60 బోట్లను కాపాడగలిగాం. కానీ 40 పూర్తిగా దగ్ధమయ్యాయని ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. అయితే ఒక్కో బోటు ధర దాదాపు రూ.60 నుంచి రూ.80 లక్షల వరకు ఉంటుందని ఆయన చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన తెలిపారు.
ఈ ప్రమాద ఘటనకు లోకల్ బాయ్ యూట్యూబర్ నాని(local boy nani) కారణమని తెలుస్తోంది. లోకల్ బాయ్ నాని, రాత్రి పలువురికి మద్యం పార్టీ ఇవ్వగా ఆ క్రమంలో వారికి గొడవ జరిగినట్లు తెలిసింది. ఆ వివాదం నేపథ్యంలోనే హార్బర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుందని అంటున్నారు. బోట్లను తగులబెట్టి వాళ్లే మళ్లీ వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి ఒకటో జెట్టి సమీపంలో ఇది జరుగగా..బాలాజీ అనే వ్యక్తికి యూట్యూబర్ బోటు అమ్మాడని…డబ్బు తిరిగి ఇవ్వాలని యూట్యూబర్ ను బాలాజీ అడిగిన క్రమంలో గొడవ వచ్చిందని తెలిసింది. ఆ నేపథ్యంలోనే ఫుల్లుగా తాగి ఉన్న వాళ్లు బోటుకు నిప్పు పెట్టినట్లు తెలిసింది. అయితే మద్యం మత్తులో కొందరు యువకులు హాంగామా సృష్టించారు విశాఖ జేసీ పేర్కొన్నారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.