»Firing On A Family Going To Chhath Puja Bihar Lakhisarai District Two Killed
Firing: పూజకు వెళ్లి వస్తున్న కుటుంబంపై కాల్పులు..ఇద్దరు మృతి
ఓ కుటుంబంలోని అందరూ కలిసి ఒకేసారి పూజ వేడుకల కోసం బయటకు వెళ్లారు. ఆ క్రమంలోనే ఆ ఫ్యామిలీపై కక్ష్య పెంచుకున్న ఓ వ్యక్తి వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిలో ఇద్దరు మరణించగా..మరో నలుగురు గాయపడ్డారు.
బీహార్లోని లఖిసరాయ్ జిల్లా(Lakhisarai district)లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం ఛత్ పూజ(chhath puja) వేడుకలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఒక వ్యక్తి ఓ కుటుంబంపై కాల్పులు జరపాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత చెందగా..వారి కుటుంబంలోని మరో నలుగురు సభ్యులు గాయపడ్డారు. అయితే అతనికి ఆ ఫ్యామిలీతో గల వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
జిల్లాలోని కబయ్యా పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాబీ మొహల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారి ఇంటికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ఛత్ పూజ వేడుకల్లో భాగంగా ఉదయిస్తున్న సూర్యుడికి ‘ఆరఘ్య’ సమర్పించి కుటుంబ సభ్యులు ఘాట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాట్నా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముస్లింల పండుగల సెలవులను పెంచి..హిందూ పండుగలకు సెలవులను తగ్గించారు. నితీష్ కుమార్ బిహార్ ప్రభుత్వ విద్యా శాఖ 2024 సెలవుల క్యాలెండర్ను ప్రకటించిన క్రమంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ అంశాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు.