TPT: తిరుపతి భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ (IISER), ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలో శ్రీకాళహస్తిలోని ది స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, బయాలజీ, వంటి శాస్త్రాలకు సంబంధించిన ప్రదర్శనలు విద్యార్థులు చేశారు.