ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో శనివారం జరగాల్సిన దినసరి సుంకం బహిరంగ వేలంపాట కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడినట్లు మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరిగి ఈనెల 17న ఉదయం 11 గంటలకు గుంతకల్లు పురపాలక సంఘం వద్ద ఈ దినసరి సుంకం బహిరంగ వేలం పాట నిర్వహిస్తామని పేర్కొన్నారు.