NLR: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. 14వ సామాజిక తనిఖీ ప్రజావేదికలో సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఏపీవో, ముగ్గురు టీఏలు, ఇద్దరు సీవోలు, ఏడుమంది ఎఫ్ఏలను అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారి వద్ద నుంచి రూ.30 లక్షల 52 వేలు రికవరీకి అధికారులు ఆదేశించారు.