ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని హాజీపురంలో ప్రజల నీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం పార్టీ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా హాజీపురంలో సీపీఎం నాయకులు పర్యటించారు. గ్రామానికి వచ్చే పైపు లైన్ చెడిపోయిన కారణంగా నీటి సరఫరా నిలిచిందని, అధికారులు తక్షణం చర్యలు తీసుకొని నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.