NTR: వెలదికొత్తపాలెం గ్రామంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరణ్ మై ప్రతిజ్ఞ చేయించి అనంతరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్దలు, సచివాలయం సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.