NLR: నెల్లూరు నగరంలోని కేఎన్ఆర్ మున్సిపల్ పాఠశాల విద్యార్థిని భవాని జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైంది. ఒడిశాలో జరిగే ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి భవాని హాజరుకానుంది. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం విజయప్రకాశ్, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. తమ పాఠశాల విద్యార్థిని ఖోఖో పోటీలలో అసమాన ప్రతిభ కనబరచడం పాఠశాలకు గర్వకారణమని హెచ్ఎం అన్నారు.