BPT: గ్రామపంచాయతీ సచివాలయ సిబ్బంది సర్వేలన్నీ పూర్తి చేసి యాప్లో నమోదు చేయాలని ఎంపీడీవో మారుతి శేషమాంబ సూచించారు. అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్సులకు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన గృహనిర్మాణాల లబ్దిదారులకు, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలన్నారు.