KDP: సిద్ధవటం మండలం మాధవరం-1లో స్థల వివాదంపై గురువారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెద్దపల్లి గ్రామ రెవెన్యూ పరిధి మాధవరం -1లోని 20 సెంట్లు స్థలంలో స్థానికుడు విజయ్ పనులు చేపట్టాడు. బొగ్గుడివారిపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం తన అనుచరులతో వెళ్లి పనులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి విజయ్ అనే వ్యక్తికి తలకు గాయమైనట్లు తెలిపారు.