SRPT: పత్తి తీసేందుకు వెళ్లిన మహిళా కూలీ ఈ నెల 7న అదృశ్యమైంది. స్థానిక ఎస్సై అజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండలం సిరిపురంకి చెందిన జానిబేగం (38) ఈనెల 7న తమ తోటి కూలీలతో కలిసి పత్తి తీసేందుకు వెళ్ళింది. తర్వాత జానిబేగం ఇంటికి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించ లేదు. దీంతో ఆమె భర్త జాఫర్ ఇవ్వాళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.