ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరువు హత్య జరిగింది. పెళ్లైన 10 రోజులకే బావ పొట్టిగా ఉన్నాడని బావమరుదులు చంపేశారు. వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేశ్‌కు.. తెనాలికి చెందిన కీర్తి అంజనీ దేవికి పెళ్లి చూపులు జరిగాయి. అయితే అమ్మాయి తల్లిదండ్రులకు గణేశ్ పొట్టిగా ఉన్నాడని నచ్చలేదు. కానీ వీరిద్దరూ తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడి.. పారిపోయి పెళ్లి చేసుకున్నారు.