CTR: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ శనివారం హెచ్చరించారు. బెట్టింగులతో జీవితం సర్వ నాశనం అవుతుందని ఆయన వెల్లడించారు. ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందుకోసం పట్టిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడితే 112కు సమాచారం ఇవ్వాలన్నారు.