VZM: గంట్యాడ మండలం కొండ తామరపల్లిలో సాక్షాత్కరించిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసుమానులను ఈనెల 24వ తేదీన విజయనగరం తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించే భారీ కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు పేర్కొన్నారు.