NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ నెల్లూరు పట్టణానికి చెందిన హరిప్రసాద్ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ. 50,116 ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు.