VZM: వేపాడ మండలం మారిక గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నిర్మించాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం సీపీఎం నాయకులు చల్లా జగన్ ఆధ్వర్యంలో జాకేరు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పాఠశాల నిర్మించకపోవడంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.