KRNL: దేవనకొండలో శుభకార్యాలకు డీజే సౌండ్ సిస్టమ్‌లకు ఇకపై అనుమతులు ఇవ్వబోమని సీఐ వేణుగోపాల్ ఇవాళ తెలిపారు. డీజే శబ్దాల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఐ పేర్కొన్నారు. రేపటి నుంచి ఎటువంటి వేడుకలకు డీజే అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజే ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.