KRNL: షరీఫ్ నగర్లో 2021లో జరిగిన హత్య కేసులో ముద్దాయి దగ్గుపాటి రాజుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కబర్థి తీర్పునిచ్చారు. హత్యాయత్నం కేసులో మరో 3 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసు అధికారులను SP అభినందించారు.