SKLM: ఇటీవలి జరిగిన బదిలీల్లో భాగంగా పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎన్. సన్యాసి నాయుడు బాధ్యతలు చేపట్టారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందజేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ముందుండాలన్నారు.