సత్యసాయి: అగళి మండలం మధూడి గ్రామంలోని వీరభద్రస్వామి ఆలయంలో గురువారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కించారు. ఆలయ ధర్మకర్తల సమక్షంలో నిర్వహించిన లెక్కింపులో రూ. 2,09,611 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నాగరాజరావు, దేవాదాయశాఖ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.