SKLM: లావేరు మండలం గుర్రాల పాలెం పంచాయతీలో జరిగే గురమ్మ పేరంటాలు జాతర మహోత్సవానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావును జాతర కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతరను వైభవంగా నిర్వహించనున్నట్లు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.