W.G: భగత్ సింగ్ ఆశయాల సాధనకు విద్యార్థులు యువత కృషి చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి అన్నారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం తణుకు వేల్పూరు రోడ్డులో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి భగత్ సింగ్ చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు.