సత్యసాయి: విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సత్యసాయి విద్యాసంస్థలు (102 సంస్థలు, 60 వేల మంది విద్యార్థులు) మరో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టాయి. సత్యసాయి శతజయంతి సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదేళ్లలోపు 20,231 మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం తపాలా కార్యాలయంలో రూ. 50 లక్షలు వెచ్చించి ఖాతాలు తెరిచారు.