TPT: ఏపీఎస్ఎన్డీసీ ఆధ్వర్యంలో ఈ నెల 25న వెంకటగిరిలోని విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం తెలిపారు. ఈ మేళాకు 14 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు.