KDP: గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి మాస కల్యాణానికి దాతలు రూ.1,00,116 లక్షల నగదును విరాళంగా అందించారు. కర్ణాటక రాష్ట్రం తుము కూరు జిల్లా పావగడకు చెందిన ప్రసన్నకుమార్, రాజమ్మ దంపతులు గురువారం మఠం సిబ్బందికి అందించారు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందుకున్నారు.