ATP: తాడిపత్రి పట్టణంలోని జూనియర్ కళాశాలలో జరిగిన మండల స్థాయి చెస్ పోటీలలో అండర్–17 విభాగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి లిఖిలేశ్వర్ రావు జిల్లా స్థాయి చెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కోచ్ పవన్ కుమార్ రెడ్డి ఆయన ప్రతిభను ప్రశంసించారు. అధ్యాపక బృందం విద్యార్థిని అభినందించింది. జిల్లా స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.