ATP: గుంతకల్లు ఆర్టీవో కార్యాలయం ఎదురుగా PDSU విద్యార్థి సంఘం నాయకులు సోమవారం ధర్నా చేపట్టారు. నియోజకవర్గ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా హాస్టళ్లను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు.