కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా ఏర్పాటు నిర్వహించనున్నారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.