KDP: అడవులు, చెట్లు లేకుంటే మానవజాతి మనుగడ అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తులసి రెడ్డి అన్నారు. ఇవాళ ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా వేంపల్లిలోని ఓ విద్యా సంస్థలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఎక్కువగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.