PPM: తోటపల్లి పార్కు సుందరీకరణ పనులను సంయుక్త కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్ వద్ద గల ఐటీడీఏ పార్కు పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి జేసీ శనివారం పరిశీలించారు. పార్కు పనులు మరింత వేగవంతం కావాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పిల్లలు ఆడుకునే ఆట పరికరాల సామాగ్రిని స్వయంగా పరిశీలించారు.