అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో 275 కిలోల గంజాయి (విలువ రూ.13.75 లక్షలు) పట్టుబడింది. చోడవరం పోలీసులు ముగ్గురు నిందితులను సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్లో TATA CURVV వాహనంలో గంజాయి స్వాధీనం చేశారు. మిగతా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.