KRNL: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు డా.ఏ.సిరి, రాజకుమారి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. బంకులకు ఇంధన సరఫరా విధానంపై సీఎం ఆరా తీశారు. నిరంతరం సరఫరా కొనసాగుతోందని కలెక్టర్లు వివరించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.