TG: ఎక్కడ ఏ సమస్య వచ్చినా మొదటగా చేరుకునేది పోలీసులేనని, అందుకే అందరికంటే ముందుగా పోలీస్ కమిషనరేట్ భవనానికి శంకుస్థాపన చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ గడ్డ పోరాటాలకు పురిటిగడ్డ అని.. భూమి కోసం, భుక్తి కోసం ఇక్కడి ప్రజలు ఎన్నో యోధులుగా ఎదిగారని గుర్తుచేశారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు.