TPT: నాయుడుపేటలో ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6 మంది నిందితులు, 2 బాలురను అదుపులోకి తీసుకుని రూ.4.20 లక్షల విలువైన రాగి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 35 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల్లో వీరి ప్రమేయం బయటపడింది. రైతులను లక్ష్యంగా చేసుకునే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.