SKLM: ఇచ్చాపురం రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 3 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చిన్నం నాయుడు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి రవాణా చేసినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.