ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం మైదానంలో ఈ నెల 19 నుంచి రెండు రోజుల పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయి జూడో బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎంఆర్డీ బలరామ్, మార్లపూడి బాలరాజు మంగళవారం తెలిపారు. పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 22 వరకు గుంటూరు ఏఎన్ యూలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.