KKD: ప్రజల ఆరోగ్య భద్రతకే అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శ్రీవిద్య సోమవారం తెలిపారు. పట్టణంలోని ఒక చికెన్ సెంటర్లో ప్రజలు కొనుగోలు చేసిన మాంసంలో పురుగుల ఘటనపై ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. పట్టణ పరిధిలోని అన్ని షాపులను అధికారులతో తనిఖీలు చేయించి, అక్రమార్కుల లైసెన్సులను కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.