విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం 9 వార్డుల్లో పర్యటించి బూత్, వార్డు కమిటీల ఏర్పాటు పురోగతి పరిశీలించారు. న్యూ ఇయర్ సందర్భంగా వైసీపీ శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేసి 2029 ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు.