సత్యసాయి: హిందూపురం రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న శుభవార్త చెప్పారు. త్వరలో హిందూపురం రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు స్టాపింగ్ కల్పిస్తామని ప్రకటించారు. అలాగే, రెండేళ్ల లోపు మడకశిరకు రైలు వస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు తాము ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.