ASR: ఉపాధి హామీ పథకం ద్వారా మండల వ్యాప్తంగా కొత్తగా ఉపాధి పనులు ప్రారంభించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి సూర్యనారాయణ డిమాండ్ చేశారు. డుంబ్రిగూడ మండలం జాంకరవలస గ్రామ గిరిజనులతో శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులు అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులు మైదాన ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.